TS RTC ప్రయాణికులకు శుభవార్త!

హైదరాబాద్​:TS RTC బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ప్రయాణికులను శుభవార్త చెప్పింది. సొంతుళ్లూకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 5,265 బస్సులను నడపనుంది.

ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. 536 సర్వీసుల్లో ముందుస్తు బుకింగ్​ సౌకర్యం సైతం కల్పిస్తున్నట్లు చెప్పారు. 22న సద్దుల బతుకమ్మ, 23న మహర్నవమి. 24 దసరా పండుగలకు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపతామని వెల్లడించారు.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి రాష్ట్ర నలుమూలలతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలకు సైతం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు సజ్జనార్‌ వివరించారు. హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి ప్రయాణీలకు రద్దీ అధికంగా ప్రాంతాలకు సైతం ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తామన్నారు. పండుగ సమయంలో -ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచబోతున్నారు

ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ మేరకు ఏర్పాట్లు చేశామని, రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలను వసూలు చేయనున్నట్లు వివరించారు. స్పెషల్ సర్వీసులకు రూపాయి సైతం అదనంగా వసూలు చేయడం లేదన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని.. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటుందని సంస్థ కోరుకుంటుందని సజ్జనార్‌ పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం tsrtconline.inలో చేసుకోవాలని.. పూర్తి వివరాల కోసం టీఎస్‌ ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

Related Posts

INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు…

Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించింన కేంద్రం

గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day 2025) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల(Padma Awards)ను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *