HYDRA: కళ్ల ముందు జరిగే విపత్తులను ఆపకపోతే తీవ్రంగా నష్టపోతాం: CM రేవంత్

Mana Enadu: మూసీ అభివృద్ధి (Musi riverfront development) విషయంలో రేవంత్ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. విపత్తులను అరికట్టాలంటే కూల్చివేతలు(Demolitions) తప్పవంటోంది ప్రభుత్వం. ఈ విషయంలో అన్నివర్గాలకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అంటున్నారు. మూడురోజుల ఢిల్లీ టూర్‌లో భాగంగా ఆయనను అధికారిక నివాసంలో MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కలిశారు. ఇద్దరి మధ్య మూసీ ప్రక్షాళన విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. వరదలు వస్తే ఇంతకంటే తీవ్రంగా నష్టపోతామని, ఆ పరిస్థితి తలెత్తక ముందే చర్యలు చేపడితే మంచిదని CM అన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో నిర్వాసితులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తగా చర్యలు చేపడతామని రేవంత్ చెప్పుకొచ్చారు.

మన కళ్ల ముందే జరుగుతున్న విపత్తులను చూస్తున్నామని, తెలిసీ అదే రూట్లో వెళ్లడం కరెక్ట్ కాదని అన్నట్లు అంతర్గత సమాచారం. ఈ క్రమంలో సామాన్యులు, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని CM రేవంత్ తెలిపారు. మరోవైపు హైడ్రా(HYDRA) కూల్చివేతలను మొదటి నుంచి MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకిస్తున్నారు. మూసీ సుందరీకరణ (Musi riverfront development) విషయంలో నిర్వాసితులను ఎలా ఆదుకోవాలన్న దానిపై CMకు అసద్ పలు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చెరువులు, FTLలను కబ్జా చేసిన‌వారి జాబితాను HYDRA ఇప్పటికే సిద్ధం చేసింది. వారందరికీ రేపో మాపో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్‌(Congress High Command)ను కలిసేందుకు CM ఢిల్లీ వెళ్లారు. అయితే జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాల(Jammu and Kashmir and Haryana election results) నేపథ్యంలో ఈ ప్రక్రియకు కాంగ్రెస్ పెద్దలు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఆచితూచి కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సామాజిక వర్గాల వారిగా కేబినెట్‌ కూర్పు ఉండాలని భావిస్తోంది. అయితే దసరా పండుగ తర్వాతే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *