బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై గురువారం కత్తిదాడి(knife attack) జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి(Leelavati Hospital)లో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. బయటి వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి వెళ్లినట్లుగా CC కెమెరాలో రికార్డ్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటనలో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది లోపటి వ్యక్తుల పనేనని నిర్ధారిస్తున్నారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor) దాడి జరిగిన సమయంలో ఇంట్లో లేకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికే నిందితుడి CCTV ఫుటేజీ విడుదల చేసిన పోలీసులు.. సైఫ్ భార్య ఇంట్లో లేని టైం చూసి పక్కా స్కెచ్‌తోనే దాడి చేశారా? ఇది తెలిసిన వారి పనేనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అడ్డుకునే ప్రయత్నంలోనే దాడి
ఇదిలా ఉండగా సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు(The Accused) రూ.1 కోటి డిమాండ్ చేసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఈ మేరకు FIR నమోదు చేశారని తెలుస్తోంది. ఇది దొంగతనం కేసుగా పోలీసులు పేర్కొన్నారు. సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడు ఇంట్లోకి చొరపడ్డాడు. కత్తి, కర్రను చేతపట్టుకొన్న దుండగుడు సైఫ్ కుమారుడు జెహ్(Jeh) గదిలోకి ప్రవేశించి డబ్బు కోసం బెదిరించాడు. అతనిని గమనించిన సైఫ్ అలీఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం(Saif Ali Khan Health) నిలకడగా ఉన్నట్లు వైద్యులు(Doctors) తెలిపారు. ఆయన ఆరోగ్యంపై సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు.
సైఫ్‌కు సినీ నటీనటుల పరామర్శ
దాడి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, పలువురు స్నేహితులు, భార్య కరీనా కపూర్‌లు ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్ పిల్లలు సారా అలీ ఖాన్(Sarah Ali Khan), ఇబ్రహీం అలీ ఖాన్, సోదరి సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్‌లు ఆస్పత్రికి వచ్చారు. సైఫ్‌ను పరామర్శించిన వారిలో చిత్ర నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand), అతని భార్య కునాల్ కోహ్లీలు ఉన్నారు. అటు ఈ సమాచారం అందిన వెంటనే బాలీవుడ్‌లో కలకలం మొదలైంది. అజయ్ దేవ్‌గణ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, టాలీవుడ్ హీరో NTR, దేవర మూవీ టీం సహా పలువురు నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పట్ల ఆరా తీశారు.
First photo of attacker, seen on CCTV has been released in Saif Ali Khan stabbing case. #Saif #SaifAliKhanNews #SaraAliKhan https://t.co/AEXgbPZy8V pic.twitter.com/x0C7a7FHob
— Neetu Khandelwal (@T_Investor_) January 16, 2025








