హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(Director James Cameron) సృష్టించిన అద్భుత సైన్స్ ఫిక్షన్ సిరీస్ ‘అవతార్’. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా ‘అవతార్3 (Avatar 3): ఫైర్ అండ్ యాష్’ రాబోతుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ (First Look Release) విడుదల చేసింది. దీనికి ‘వరంగ్’(Varang) అనే క్యాప్షన్ జత చేసి, కొత్త పాత్రను పరిచయం చేశారు. పండోరా ప్రపంచంలోని ప్రధాన పాత్రలైన జేక్, నేయిత్రి, కిరి, కల్నల్ లాంటి క్యారెక్టర్లు ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమే. కానీ ఈ కొత్త లుక్ ద్వారా కథలో కొత్త మలుపు ఆశించవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
ఈ లుక్ విడుదలతోపాటుగా, ‘అవతార్ 3’ ట్రైలర్(Avatar 3 Trailer Release) గురించి కూడా అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ట్రైలర్‌ను ఈ వారం విడుదల కానున్న ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అంటే జూలై 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ సినిమాను థియేటర్లలో చూస్తే, అవతార్ 3′ ట్రైలర్ థియేటర్లలో ప్లే అవుతుంది అన్నమాట.
మరోవైపు, ‘అవతార్ 3’ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నారు. ఇండియాలో గత రెండు అవతార్ సినిమాలు ఘన విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు ‘ఫైర్ అండ్ యాష్’పై కూడా ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
View this post on Instagram






