Plane Crash కుప్పకూలిన విమానం.. 50 మందికి పైగా మృతి

Mana Enadu : కజకిస్థాన్‌ (Kazakhstan)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు (Azerbaijan Airlines) చెందిన ఓ ప్రయాణికుల విమానం అక్టౌ సమీపంలో కుప్పకూలిపోయింది. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్రయాణికుల విమానం రష్యా రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది(Kazakhstan plane crash). ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ఉన్నారని, వారిలో 67 మంది ప్రయాణికులు ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు కజకిస్తాన్​ అధికారులు వెల్లడించారు. 50 మందికి పైగా మంటల్లో కాలిపోయి చనిపోయినట్లు సమాచారం.

ఎమర్జెన్సీ లాండింగ్​కు ప్రయత్నిస్తూ..

అజైర్​బైజాన్​లోని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయల్దేరిన ఈ విమానాన్ని దట్టమైన మంచు కారణంగా దారి మళ్లించారు. ఈ క్రమంలోనే కజకిస్తాన్​లోని అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్‌పైన విమానం గిరగిరా తిరుగుతూ నేల కూలింది. దాంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *