
సాధారణంగా థియేటర్లో రిలీజ్ అయిన 50 రోజులు దాదాపు రెండు నెలల తర్వాత చిత్రాలు ఓటీటీలోకి రావాలన్న నిబంధన ఉంది. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేక త్వరగానే తిరుగుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నింటిని ఓటీటీలు ఆదుకుంటున్నాయి. ముందుగా ఓటీటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలే ఇలాంటి సినిమా నిర్మాతలను గట్టెక్కిస్తున్నాయి. ఇప్పటివరకు ఇలా చాలా చిత్రాలు థియేటర్లో రిలీజ్ అయి నెల కూడా తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. తాజాగా ఆ సినిమాల జాబితాలో చేరింది ‘బాపు’ (Baapu) చిత్రం.
ఓటీటీలోకి బాపు సినిమా
థియేటర్‌లో రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది ‘బాపు’ మూవీ. టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji), సీనియర్ నటి ఆమని, అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దయ దర్శకత్వం వహించారు. ‘బలగం’ సుధాకర్‌రెడ్డి టైటిల్ పాత్రలో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
మార్చి 7 నుంచి బాపు స్ట్రీమింగ్
ఇక తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో బలగం (Balagam) చిత్రంలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని అంతా భావించారు. కానీ అన్ని సినిమాలు బలగం కాలేవు. బాపు సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో అలరించేందుకు రెడీ అయింది. జియో హాట్‌స్టార్ (Jio Hotstar) వేదికగా మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒక కుటుంబ ప్రయాణాన్ని అందరూ చూసి ఆనందించండి జియో హాస్ట్ స్టార్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.