‘కన్నప్ప’ టీజర్ రిలీజ్.. ప్రభాస్ ఎంట్రీ అదుర్స్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కన్నప్ప (Kannappa)’ సినిమా టీజర్ వచ్చేసింది. పాన్ ఇండియా భాషల్లో మేకర్స్ ఈ టీజర్ విడుదల చేశారు. మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్, అవా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోహన్ బాబు, మోహన్ లాల్ (Mohan Lal), అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.

ప్రభాస్ ఎంట్రీ అదుర్స్

తాజాగా విడుదల చేసిన టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తన ప్రజలను కాపాడుకునేందుకు తిన్నడు చేసిన పోరాటం, దేవుడంటే నమ్మకం లేని తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ (Kannappa Teaser) చూస్తే తెలుస్తోంది. ఇక టీజర్ చివరలో రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. 1.24 నిమిషం సాగిన టీజర్ లో చివరి 5 సెకన్లు గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas) గెస్ట్ రోల్ సినిమాకే హైలైట్ నిలవనున్నట్లు టాక్. ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *