బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

భారతీయ తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ.. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో వచ్చిన తొలి చిత్రం ‘ఆదిత్య 369 (Aditya 369)’ సినిమా నందమూరి బాలకృష్ణ (Balakrishna) కెరీర్ లోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జంధ్యాల డైలాగ్స్, ఇళయరాజా (Ilayaraja) మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

ఆదిత్య 369 రీ రిలీజ్

అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బాలయ్య ‘ఆదిత్య 999 (Aditya 999)’ తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారు. అందులో ఆయన వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు తెరకెక్కిస్తారో మాత్రం చెప్పలేదు. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రకటించి షూటింగ్ పూర్తయి రిలీజ్ అయ్యే వరకు వారు ఎదురుచూడక తప్పదు. అప్పటిలోగా ప్రేక్షకులను మరోసారి టైమ్ ట్రావెల్ (Time Travel)లో భూత, భవిష్యత్ కాలాలకు తీసుకెళ్లాలని ఆదిత్య 369 మేకర్స్ నిర్ణయించారు.

ఎంతో ఉత్సాహంగా ఉన్నాం

ఈ నేపథ్యంలోనే ఆదిత్య 369 సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ వేసవిలో గ్రాండ్ గా విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ”ఆదిత్య 369 (Aditya 369 Re Release) సినిమా తొలిసారి రిలీజ్ అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు రీ రిలీజ్ కు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమాను డిజిటల్ 4Kలో మరింత అద్భుతంగా తీర్చిదిద్దాం. ‘ఆదిత్య 369’ చిత్రాన్ని ఈ సమ్మర్ లో గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *