
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab), హనురాఘవపూడితో ఫౌజీ, ప్రశాంత్ నీల్ తో సలార్-2, నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్-2, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ (Spirit) ఇలా ఐదు సినిమాలు లైనప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆరో సినిమాను లైన్ లో పెట్టాడు డార్లింగ్. హను-మాన్ (HanuMan)తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు సమాచారం.
ప్రభాస్-ప్రశాంత్ సినిమా
ప్రశాంత్ వర్మ (Prashant Varma) ప్రస్తుతం కాంతార ఫేం రిషభ్ శెట్టితో ‘జై హనుమాన్ (Jai Hanuman)’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజను లాంఛ్ చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. అయితే మోక్షజ్ఞ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కేటట్లు లేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసిన ప్రశాంత్ వర్మ కథను విన్న డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ప్రభాస్ తో బ్రహ్మరాక్షస్
గతంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా ఈ యంగ్ డైరెక్టర్.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ‘బ్రహ్మరాక్షస్ (Brahmarakshas)’ అనే సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక అదే కథను ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్లాడు వర్మ. ప్రభాస్ కటౌట్ కి సరిగ్గా సరిపోయే పాత్ర కావడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మహాశివరాత్రి కానుకాగా నేడు ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందట. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుంది.