నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లతో ఈ సినిమా జోరు చూపిస్తోంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది.
8 రోజుల్లో రూ.150 కోట్లు
ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్న ఈ సినిమా, తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకూ రూ.156 కోట్లు సాధించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ పోస్టర్ ను ఎక్స్ వేదికగా చిత్రబృందం రిలీజ్ చేసింది.
The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥
Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28
— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025
థియేటర్లలో డాకు హవా
డాకు మహారాజ్ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దియోల్ కీలక పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్ తమన్ తన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు.
నాలుగోసారి వంద కోట్ల సినిమా
ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 56 కోట్లు (గ్రాస్) సాధించి బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచింది. మరోవైపు రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. అలా బాలయ్య తన కెరీర్లో వరుసగా నాలుగోసారి వంద కోట్ల మార్క్ అందుకున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలు ఈ క్లబ్ లో చేరగా.. డాకు మహారాజ్ కేవలం 4 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టింది.
All in one entertainment package?
That’s #DaakuMaharaaj 😎Sort your Weekend Plans and Enjoy the Madness on the big screens ❤️#BlockbusterHuntingDaakuMaharaaj 🔥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby @MusicThaman @Vamsi84 @ItsMePragya… pic.twitter.com/pdcpc8jE1D
— Sithara Entertainments (@SitharaEnts) January 19, 2025






