అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి బాజా.. అఖిల్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్!

అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజా మోగబోతోంది. ఇటీవలే అక్కినేని నాగార్జున (Nagarjuna) పెద్ద తనయుడు నాగచైతన్య నటి శోభితా ధూళిపాళను వివాహ మాడిన విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి సమయంలోనే నాగ్.. తన చిన్న కుమారుడు, యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) అక్కినేని పెళ్లి వార్తను చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అఖిల్ కు జైనబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని చెబుతూ ఎక్స్ వేదికగా ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు.

గ్రాండ్ గా అఖిల్-జైనబ్ పెళ్లి

అయితే తాజాగా అఖిల్, జైనబ్ (Akhil Marriage Date)ల పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మార్చి 24వ తేదీన వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే చై, శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన విషయం తెలిసిందే. అఖిల్ పెళ్లి మాత్రం ధూంధాంగా చాలా గ్రాండ్ గా జరపనున్నట్లు తెలిసింది. తన చిన్న కొడుకు వివాహానికి నాగార్జున సినిమా, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానం అందించనున్నాడట. దీని గురించి అధికారిక ప్రకటన రాకపోయినా ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

త్వరలోనే కొత్త సినిమా ప్రకటన

‘సిసింద్రీ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ‘అఖిల్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ మూటగట్టుకుని.. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో కాస్త ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ యంగ్ హీరో కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా అంటే ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఇక చివరగా ‘ఏజెంట్ (Agent Movie)’ సినిమాతో మరో డిజాస్టర్ ను మూటగట్టుకుని సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *