చాహల్-ధనశ్రీలకు విడాకులు మంజూరు

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అతడి భార్య ధనశ్రీ వర్మ (dhanashree verma) విడాకుల వ్యవహారం గత కొంతకాలంగా మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడం, ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ తర్వాత ఈ జంట వేర్వేరుగా పెట్టిన పోస్టులు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు నేషనల్ మీడియా కోడై కూస్తోంది.

ధనశ్రీ-చాహల్ కు విడాకులు

గురువారం రోజున బాంద్రా ఫ్యామిలీ కోర్టు (Bandra Family Court)లో తుది విచారణకు ఈ జంట హాజరైంది. విచారణ సమయంలో న్యాయమూర్తి ఈ జంటను కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరు కావాలని ఆదేశించగా దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ జరిగింది. ఇక చివరలో విడిపోవ‌డానికి స‌మ్మ‌త‌మేనా? అని జంట‌ను ప్ర‌శ్నించ‌గా, చాహల్ – ధనశ్రీ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్లు ధృవీకరించారని ఏబీపీ న్యూస్ కథనాలు వెల్లడించాయి.

నో కామెంట్స్

పూర్తి విచార‌ణ తర్వాత న్యాయమూర్తి ఈ జంటకు అధికారికంగా విడాకులు (Chahal Dhanashree Divorce) మంజూరు చేస్తూ చాహల్ – ధనశ్రీ ఇకపై భార్యాభర్తలుగా చట్టబద్ధంగా క‌లిసి ఉండలేరు అని ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం సాయంత్రం 4:30 గంటలకు తుది తీర్పు వెలువరించిందని మీడియా వెల్ల‌డించింది. అయితే ఈ జంట ప్రస్తుతానికి తమ విడాకుల గురించి ఏ రకమైన అధికారిక ప్రకటన చేయలేదు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *