సంచలనాలకు మారుపేరైన టీ20ల్లో మరో రికార్డు నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Syed Mushtaq Ali Trophy) బ్యాటర్లు దంచికొట్టారు. ఇండోర్‌లో సిక్కిం(Sikkim)తో జరిగిన మ్యాచ్‌లో బరోడా టీమ్ ఏకంగా 349/5 పరుగులు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ (Highest score in t20)అని చెబుతున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బరోడా (baroda) ఓపెనర్లు శశ్వత్ రావత్(16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(53) బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడితే.. వన్‌డౌన్‌లో వచ్చిన భాను పునియా 51 బంతుల్లో 134 ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు బాదడం విశేషం. బరోడా టీమ్‌లో శైవిక్ శర్మ(17 బంతుల్లో 55), వికెట్ కీపర్ విష్ణు సోలంకి(16 బంతుల్లో 50) రన్స్ చేశారు. దీంతో బరోడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 349 రన్స్ చేసింది.
అనంతరం 350 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సిక్కిం 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 86 రన్స్ మాత్రమే చేసింది. దీంతో బరోడా 263 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. బరోడా బౌలర్లలో అశ్విన్ కుమార్, మహేశ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్యా, సేత్, అభిమన్యు సింగ్ తలో వికెట్ తీశారు. భాను పునియాకు ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గాంబియాపై జింబాబ్వే (Zimbabwe) ఇటీవల 344–4 స్కోరు చేసి రికార్డ్ సృష్టించింది. పొట్టి క్రికెట్లో ఇదే ఇప్పటివరకు అత్యధిక స్కోరు. ఆ రికార్డును ఇప్పుడు బరోడా జట్టు తిరగరాసింది.








