World cup 2023 finals:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ

మ‌న ఈనాడుఃఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించడమే కాక… భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయబోతోంది.
ఐసీసీ వరల్డ్ కప్ లాస్ట్ స్టేజ్ కు చేరుకుంది. నవంబర్ 19, ఆదివార్ ఫైనల్స్ మ్యాచ్ కు టీమ్ లతో పాటూ అందరూ రెడీ అవుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయిన ఆస్ట్రేలియన్లను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇవాళ వచ్చేస్తారు.

ఫైనల్ మ్యాచ్ తో మెగా టోర్నీ అయిపోతుంది. అందుకే బీసీసీఐ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు అహ్మదాబాద్‌ స్టేడియంలో ఎయిర్ షో నిర్వహించనున్నట్లు గుజరాత్ డిఫెన్స్ పీఆర్‌వో తెలిపారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌లో మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉంటాయి. గతంలోనూ వివిధ సందర్భాల్లో విన్యాసాలు ప్రదర్శించింది.

ఇక భారత్ ఫైనల్ కు చేరుకున్నందుకు అందరూ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ చూడ్డానికి సెలబ్రిటీలు అందరూ క్యూలు కడుతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మ్యాచ్ చూడ్డానికి వస్తారని అంటున్నారు. అయితే ఈ విషయం గురించి పీఎంవో నుంచి అధికారికంగా ప్రకటన ఏమీ రాలేదు. ఇక మ్యాచ్ ముగిసన తర్వాత కూడా భారీ వేడకలను నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. సెలబ్రీలతో ప్రోగ్రామ్స్ ఉండొచ్చని తెలుస్తోంది. దాంతో పాటూ కళ్ళు చెదిరే చాణా సంచా కూడా ఉంటుందని చెబుతోంది బీసీసీఐ.

వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమ్ ఇండియా. దీంతో భారత జట్టు మీద అంచనాలు హై లెవల్లో ఉన్నాయి. కప్ ను కూడా ఇండియానే సాధించాలని భారతీయులు అందరూ కోరుకుంటున్నారు.

 

Share post:

లేటెస్ట్