Bigg Boss 7 Telugu: నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో శోభ శెట్టి పై ఓ రేంజ్ లో ఫైర్ ఆయిన శివాజీ

మన ఈనాడు:ర్యాంక్ లను బట్టి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఎవిక్షన్ పాస్‌ని సొంతం చేసుకోవడానికి నిన్నటి ఎపిసోడ్ లో టేక్ ఏ బౌ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో విల్లుని పైకి ఎత్తి.. అక్కడ ఉన్న బాల్స్‌ని కింద పడకుండా బ్యాలెన్స్ చేయాలి. ఈ టాస్క్ లో వరుసగా అన్ని టాస్క్ లు విన్ అవుతున్న యావర్ ను ఇద్దరితో పోటీ పడాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో శివాజీ, ప్రియాంక లను బిగ్ బాస్ ఎంపిక చేశాడు. విల్లు పై ఎట్టి పట్టుకొని బాల్స్ ను ఎవరైతే చివరి వరకు బ్యాలెన్స్ చేస్తారో వారే విన్నర్ అని చెప్పాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎవిక్షన్ పాస్‌ కోసం పోటీ జరుగుతుంది. మొన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అంతా ఒక్కఓక్కరు తమ అర్హతను బట్టి ర్యాంక్ లు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఆ ర్యాంక్ లను బట్టి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఎవిక్షన్ పాస్‌ని సొంతం చేసుకోవడానికి నిన్నటి ఎపిసోడ్ లో టేక్ ఏ బౌ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో విల్లుని పైకి ఎత్తి.. అక్కడ ఉన్న బాల్స్‌ని కింద పడకుండా బ్యాలెన్స్ చేయాలి. ఈ టాస్క్ లో వరుసగా అన్ని టాస్క్ లు విన్ అవుతున్న యావర్ ను ఇద్దరితో పోటీ పడాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో శివాజీ, ప్రియాంక లను బిగ్ బాస్ ఎంపిక చేశాడు. విల్లు పై ఎట్టి పట్టుకొని బాల్స్ ను ఎవరైతే చివరి వరకు బ్యాలెన్స్ చేస్తారో వారే విన్నర్ అని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ గేమ్ లో తరకాసు ఉందనిపిస్తుంది. వరుసగా నాలుగు గేమ్స్ విన్ అయిన యావర్ ను తీసుకొచ్చి శివాజీ, ప్రియాంకతో పోటీ పడమన్నాడు. శివాజీ, ప్రియాంకలో ఎవరు గెలిచినా వాళ్ళకే ఎవిక్షన్ పాస్ దక్కుతుంది. పాపం నాలుగు టాస్క్ లు విన్ అయిన యావర్ కు అన్యాయం జరుగుతుంది.
ఈ టాస్క్ కు శోభను సంచలక్ గా నిర్ణయించాడు. ఆమెతో పాటు ప్రియాంక కూడా సంచలక్ గా నియమించాడు. ఈ గేమ్ నుంచి ముందుగా ప్రియాంక అవుట్ అయ్యింది. తన బాల్స్ బ్యాలెన్స్ తప్పడంతో ఆమె ఈ టాస్క్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆతర్వాత శివాజీ , యావర్ గేమ్ కంటిన్యూ చేశారు.
బాల్స్ పెట్టేటప్పుడు ఎక్కువ సేపు పట్టుకుని ఉండకూడదని బిగ్ బాస్ చెప్పాడు. కానీ శివాజీ తన బాల్స్ ను అలానే పట్టుకొని ఉన్నాడు. దాంతో శోభా అన్న బాల్స్ అలా పట్టుకొని ఉండొద్దు అన్న అని చెప్పింది. దానికి శివాజీ ఉందమ్మా అంటూ ఆమె పై సీరియస్ అయ్యాడు. ఆతర్వాత బిగ్ బాస్ కల్పించుకొని మీరు ఎక్కువ సేపు బాల్స్ పట్టుకొని ఉంటున్నారు. అది రూల్స్ కు విరుద్ధం అని అన్నాడు. ఆతర్వాత శోభా శెట్టి, ప్రశాంత్ ఇద్దరు శివాజీని హెచ్చరిస్తూనే ఉన్నారు. దాంతో ఫోకస్ తప్పి శివాజీ బాల్స్ కింద పడిపోయాయి. దాంతో ఆ బాల్స్ విసిరి కొట్టి నన్ను మీరు డిస్ట్రబ్ చేశారు అంటూ అరిచి కేకలు పెట్టాడు. ప్రశాంత్ నేనేం చేశా అన్న అని అడిగినా కూడా నువ్వు సైగలు చేసి నన్ను డిస్ట్రబ్ చేశావ్ అంటి అరిచి గోల చేశాడు. అయితే విన్నర్ ఎవరు అన్నది బిగ్ బాస్అనౌన్స్ చేయగానే .. శోభా శెట్టి నియమాల ప్రకారం ప్రియాంక గెలిచింది. శివాజీ, యావర్ ఎక్కువ సేపు బాల్స్ ను పట్టుకున్నారు అని చెప్పింది శోభా దాంతో శివాజీ వర్సెస్ శోభా ఫైట్ జరిగింది. దాంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ గట్టిగానే జరిగింది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని శివాజీ అరిచాడు.

Share post:

లేటెస్ట్