Siddaramaiah: నాకు సొంత ఇల్లు కూడా లేదు: కర్ణాటక సీఎం సిద్దరామయ్య

Mana Enadu: తాను నిజాయితీతో కూడిన రాజకీయాలను(politics of honesty) మాత్రమే చేశానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) అన్నారు. ముడా కుంభకోణం(MUDA ‘scam’ ) కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన తాజాగా స్పందించారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తనకు సొంత ఇల్లు(own house) కూడా లేదని చెప్పుకొచ్చారు. కావాలనే ప్రతిపక్షాలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. వెనుకబడి వర్గానికి చెందిన వ్యక్తి రెండోసారి CM కావడాన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా BJP తట్టుకోలేకపోతోందని దుయ్యబట్టారు.

ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి

తన అసెంబ్లీ నియోజకవర్గమైన వరుణ(Assembly constituency of Varuna)లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘మైసూరులోని కువెంపు రోడ్డులో నిర్మిస్తున్న ఇల్లు తప్ప తనకు మరే ఇతర ఆస్తి లేదని CM పేర్కొన్నారు. ఇది ఇంకా పూర్తి కాలేదు, మేము దీని నిర్మాణం ప్రారంభించి మూడు సంవత్సరాలు అయ్యింది, గత మూడు సంవత్సరాల నుంచి పనులు నిదానంగా జరుగుతున్నాయి. నాపై ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కుమారస్వామి (JDS), యడ్యూరప్ప, విజయేంద్ర, అశోక, ప్రహ్లాద్ జోషి (BJP) నేను ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు’ అని అన్నారు.

 ఆ స్థలాల కేటాయింపులపైనే ఆరోపణలు

కాగా మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) తన భార్యకు 14 చోట్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిద్దరామయ్య లోకాయుక్త, ఈడీ (Lokayukta and ED) విచారణలను ఎదుర్కొంటున్నారు. సిద్దరామయ్య భార్య, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు-మల్లికార్జున స్వామి వారి నుంచి భూమిని కొనుగోలు చేసి పార్వతికి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయంలో సిద్దరామయ్య సహా పలువురిపై లోకాయుక్త నిందితులుగా చేర్చింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *