YS JAGAN: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం.. బిగ్ ఎక్స్‌పోజ్ బయటపెట్టిన టీడీపీ

Mana Enadu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కుటుంబంలో మరోసారి ఆస్తి వివాదం చెలరేగింది. తన తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma), సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila)పై జగన్ కోర్టులో పిటిషన్(Petition) దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌(Saraswati Power and Industries)లో వాటాల కేటాయింపుపై వీరిద్దరిపై జగన్ పిటిషన్లు వేశారు. ఆస్తి పంపకాల విషయంలో విజయమ్మ, షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో జగన్ ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్(Classic Realty Private Limited), జగన్, భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు వేశారు, దీని గురించి పెద్ద చర్చ సాగుతోంది.

పది అంశాలతో వైఎస్ షర్మిల రాసినట్లుగా

జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ ఆయన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలు లేఖ రాశారు. చట్టబద్ధంగా కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవటానికి తన సొంత తల్లి, చెల్లి మీద కూడా జగన్ కేసులు పెట్టిన విషయం తాజాగా వెల్లడైంది. దీనికి సంబంధించిన ఆధారాలతో కూడిన లేఖను TDP తాజాగా లీక్ చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై గత నెలలో YS జగన్‌కు.. వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న లేఖను TDP తన అధికారిక ఎక్స్(X) ఖాతాలో పోస్టు చేసింది. బిగ్ ఎక్స్‌పోజ్(Big Expose) అంటూ ఉదయమే ప్రకటించిన TDP.. పది అంశాలతో వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న లేఖను.. అధికారిక ఎక్స్(X) ఖాతాలో పోస్ట్ చేశారు. అసలు ఆ లేఖలో ఏముందంటే..

 లేఖలో ఏముందంటే..

డియర్ షర్మిల.. “నన్ను రాజకీయంగా ఏమి అనకు, రాజకీయంగా నాకు అడ్డు రాకు, అప్పుడు నీకు ఆస్తులు రాసిస్తా” అని సొంత చెల్లి షర్మిలని బెదిరిస్తూ సైకో జగన్ లేఖ రాశాడు’’ అని పేర్కొంది. “నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే, నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? రాజకీయంగా నాపై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ ఇవ్వను. సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి.. అమ్మ మీద, నీ మీద కేసు వేస్తున్నా.”- జగన్

‘‘జగన్‌ని సైకో అని ఎందుకు అంటారో, ఇప్పుడు తెలిసిందా? ఆస్తి కోసం, డబ్బు కోసం, సొంత తల్లి పైనే కేసులు వేసి, కోర్టుకి లాగాడు. చెల్లి రాజకీయాల్లో ఉంటే తట్టుకోలేక పోతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తా అని బెదిరిస్తున్నాడు’’ అని TDP ట్విటర్ వేదికగా విమర్శించింది.

Share post:

లేటెస్ట్