AP DSC 2024: నిరుద్యుగులకు శుభవార్త.. నవరంబర్ ఫస్ట్‌ వీక్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్!

Mana Enadu: ఏపీ(Andhra pradesh)లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. ఎన్నిరోజులుగా నిరుద్యోగులు ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌(Mega DSC 2024 Notification) త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ(School Education Department) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారం(November First week)లో నోటిఫికేషన్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది.

 మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

నవంబరు 3వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ప్రకటించింది. ఈ DSC ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించింది. మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్ (SGT) పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్ టీచర్ (SA) పోస్టులు 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT) పోస్టులు1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT) పోస్టులు 286, ప్రిన్సిపాల్‌ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయుల (PET) పోస్టులు 132 వరకు ఉన్నాయి. దీంతో విద్యార్థులు DSC కోచింగ్ తీసుకునేందుకు ఆ సక్తి చూపుతున్నారు.

వారికి ఫ్రీ కోచింగ్

అయితే భారీగా డబ్బులు కట్టి కోచింగ్ తీసుకోలేని వారికోసం సాంఘిక సంక్షేమ శాఖ(Social welfare) గుడ్ న్యూస్ తెలిపింది. కుటుంబ ఆదాయం రూ. 2.50 కంటే తక్కువ ఉన్నవారు.. మెగా డీఎస్సీకి అర్హత సాధించిన వారికి ఉచిత కోచింగ్(Free coaching) ఇవ్వనుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు మూడు నెలలు అన్ని వసతులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *