‘బిగ్‌బాస్‌’ హౌసులో అర్ధరాత్రి హల్ చల్.. గంగవ్వకు గుండెపోటు.. ఏం జరిగింది?

Mana Enadu : బిగ్​బాస్ తెలుగు సీజన్ 8(Bigg Boss 8)లో మంగళవారం అర్ధరాత్రి హల్ చల్ చోటుచేసుకుంది. ఈ సీజన్​లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ గంగవ్వకు గుండెపోటు వచ్చిందనే వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే అది వాస్తవం కాదని.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. కానీ ప్రోమోలో గంగవ్వ(Gangavva) ప్రవర్తించిన తీరు హౌస్ మేట్స్ తో పాటు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. అసలేం జరిగింది అంటే?

గంగవ్వకు గుండెపోటు

వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ ఓ యూట్యూబ్​ ఛానల్ ద్వారా బాగా పాపులర్ కాగా ‘బిగ్​బాస్’ సీజన్ 4 లో ఆమెను కంటెస్టెంట్​గా తీసుకున్నారు. ఆ సీజన్​లో అనారోగ్య కారణాలతో కొన్ని వారాలకే హౌసు విడిచి వెళ్లిపోయింది గంగవ్వ. తాజాగా సీజన్​8 లో వైల్డ్​ కార్డ్(Bigg Boss 8 Wild Card Entry)​ ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే మంగళవారం అర్ధరాత్రి గంగవ్వకు హార్ట్ ఎటాక్ వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. దీంతో బిగ్​బాస్​ టీమ్ అసలు హౌసులో అర్ధరాత్రి ఏం జరిగిందో ఓ ప్రోమో వీడియో రిలీజ్​ చేసింది. అందులో ఏముందంటే..?

గంగవ్వకు దెయ్యం పట్టిందా?

అందరూ పడుకున్న సమయంలో గంగవ్వ(Gangavva Heart Attack) లివింగ్​ రూమ్​లోని సోఫా మీద కూర్చోని బిగ్గరబిగ్గరగా అరుస్తూ దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేసింది. ఆ సౌండ్ విన్న హౌస్ మేట్స్ ఆమె వద్దకు వచ్చి చూసి ఆమె ప్రవర్తన చూసి హడలెత్తిపోయారు.  దగ్గరకు వచ్చిన కంటెస్టెంట్లను గంగవ్వ భయపెట్టింది. ఎలాగోలా హౌస్ మేట్స్ గంగవ్వను తీసుకెళ్లి బెడ్​ రూమ్​లో పడుకోబెట్టారు. తీరా సీన్​ కట్​ చేస్తే ఇది ప్రాంక్​ అయినట్లు వీడియోలో చెప్పారు.

అసలేం జరిగింది?

గంగవ్వ ఇలా ప్రవర్తించే కంటే ముందే టేస్టీ తేజ, అవినాష్(Jabardasth Avinash) గార్డెన్​ ఏరియాలో కూర్చోన్నారు. ఈ సందర్భంగా ” ఇంటి సభ్యుల మీద మేము ముగ్గురం ఘోస్ట్​ ప్రాంక్​ చేస్తున్నాం. ఇది నాకు, అవినాష్, గంగవ్వ ముగ్గురికి మాత్రమే తెలుసు” అంటూ టేస్టీ తేజ చెప్పాడు. అంతకుముందే దెయ్యంలా ఎలా నటించాలో గంగవ్వకు చూపించాడు. ఇది ప్రాంక్ అని తెలియని హౌజ్​మేట్స్​ మాత్రం చాలా భయపడిపోయారు.

Share post:

లేటెస్ట్