Bengaluru techie: బెంగళూరు టెకీ సూసైడ్​.. భార్య, అత్త, బావమరిది అరెస్ట్​

Mana Enadu : భార్య వేధింపులు తాళలేక బెంగుళూరు టెకీ (Bengaluru techie) 40 పేజీల సూసైడ్​ లేఖ రాసి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆ కేసులో తాజాగా కీలక పరిణామం జరిగింది. టెకీ అతుల్‌ సుభాష్​ (Atul Subhash) భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖితతోపాటు ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌ను సైతం అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న నిఖితను డిసెంబర్ 14న బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసకున్నారు. ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడిని యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఈ ముగ్గురిని ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నిఖిత తండ్రి సుశీల్ సింఘానియా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భార్య వేధింపులు తట్టుకోలేక అతుల్‌ సుభాష్‌ (Atul Subhash case) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. సూసైడ్​కు ముందు అతడు ఏకంగా 40 పేజీల లేఖ (suicide note) రాసి బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఆ లేఖలో తన ఆవేదనంతా వెళ్లగక్కాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్​ బెంగళూరులోని ఓ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పని చేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్నారు. (Atul Subhash vs wife) భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇ-మెయిల్‌ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులకు పంపించారు. తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకొనే ముందు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. అందులో అతడు ‘నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలోపేతం చేస్తోంది. వారు దానిని వాడుకొని నన్ను నాశనం చేస్తున్నారు. ఇది ఒక విష వలయంగా మారింది. అందుకే నేను చనిపోవాలనుకుంటున్నా’ అని ఆవేదన వ్యక్తంచేశాడు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *