Israel vs Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ కాల్పులు.. 69మంది మృతి

గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel) భీకర దాడులు(Bombed) చేస్తోంది. ఇజ్రాయెల్ వరుస దాడులు చేయడంతో గాజా ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. వరుస దాడులతో గాజా అతలాకుతలం అయ్యింది. తాజాగా గాజాలోని నాలుగు పాఠశాలల(Four Schools)పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 69మంది పౌరులు మృతి చెందారు. వీరితో మరికొందరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో పాలస్తీనా సివిల్ డిఫెన్స్(Palestine Civil Defense) అధికారులతో పాటు జర్నలిస్టులు(Journalists) కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు సిరియా(Syria)పై కూడా ఇజ్రాయెల్ పెద్ద దాడి చేసింది. కీలక నౌకా స్థావరమైన టార్టస్ నగరం(The city of Tartus)పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా సిరియాలో భూకంపం(Earthquake in Syria) సంభవించిన దాని కంటే ఎక్కువగా శబ్దం వచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పేలుడు నుంచి వచ్చిన మంట కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించింది. గత కొన్నేళ్ల నుంచి సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. 2012 నుంచి చేసిన దాడుల్లో ఇదే పెద్దదని నిపుణులు చెబుతున్నారు.

కాగా హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధం(Hamas-Israel war)లో ఇప్పటివరకు మహిళలు, పిల్లలతో కలిపి మొత్తం 44,300 మంది చనిపోయినట్లు హమాస్ పరిధిలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గాజాలో 178 మంది చనిపోయారని, యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన భయంకర దాడుల్లో ఇది కూడా ఒకటని హమాస్ హెల్త్ మినిస్ట్రీ(Hamas Health Ministry) తెలిపింది. హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంపై దాడి చేసి 1,300 మందిని హతమార్చడంతో పాటు 240 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్రస్థాయికి చేరింది.

  • Related Posts

    Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

    టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

    Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

    ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *