భగవద్గీతకు యునెస్కో గుర్తింపు.. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం

భారతీయ సంస్కృతి, వారసత్వానికి మరోసారి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత (Bhagavad Gita), భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో (UNESCO) గుర్తింపు దక్కింది. యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో ఈ రెండింటికి చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం అంటూ దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు.

భారతీయ జ్ఞానసంపదకు గౌరవం

భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులని పేర్కొన్నారు. ఇప్పటివరకు భారతదేశం నుంచి 14 శాసనాలు.. యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయని వెల్లడించారు.

మనం గర్వించదగ్గ విషయం

ఇక దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం.. మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. వేల సంవత్సరాల నుంచి భారతీయ నాగరికత, ప్రజల్లో భగవద్గీత చైతన్యాన్ని పెంపొందించిందని తెలిపారు. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని వెల్లడించారు. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *