లంకపై ఇరవై నాలుగేళ్ల పగను భారత క్రికెట్ జట్టు ఈరోజు తీర్చుకుంది. ఎన్నో ఆటల ప్రయత్నం ఆఖరికి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ రూపంలో సఫలమై క్రికెట్ అభిమానుల ఆశలు తీర్చింది. 1999 కొకో కోలా కప్ లో శ్రీలంకతో తొలి మ్యాచ్ భారత జట్టుకు, సౌరవ్ గంగూలీకి పీడకల మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక అప్పటి కెప్టెన్ సనత్ జయసూర్య ఒంటిచేతి పోరాటంతో 189 పరుగులతో చెలరేగగా.. 299 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గంగూలి నేతృత్వంలో చేజింగ్ మొదలుపెట్టిన భారత టీం చమింద వాస్ బౌలింగ్ ముందు తేలిపోయి 54 పరుగులకే ఆలౌటై ఓటమితో ఆట ముగించింది. ఈ మ్యాచ్‌లో చమింద వాస్ 5 వికెట్లు, ముత్తయ్య మురళీధరణ్ 3 వికెట్లు తీయగా.. భారత్ తరఫున గంగూలి, యువరాజ్ సింగ్, సచిన్ టెండుల్కర్, సునీల్ జోషి ఒక్కో వికెట్టుతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుత భారత్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ 2 పరుగులు చేసి మురళీధరణ్ బౌలింగ్‌లో ఔటయ్యారు.