మన ఈనాడు: చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. కారు వదిలి నాయకులు హస్తం బాట పడుతున్నారు. సోమవారం తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టివిక్రమార్క సమక్షంలో చింతకాని మండల ఎంపీపీ కొపూరి పూర్ణయ్య కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.అంతకముందు చింతకాని మండల ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు.
తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న చింతకాని మండలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గులాబీ గూటికి చేరారు. ఆతర్వాత మండలంలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యర్థిగా పార్టీగా మండలంలో బీఆర్ఎస్ క్యాడర్ నిలిచింది.
సీపీఐ, కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు హస్తం సత్తా చూపించి కేసీఆర్‌కు ఖమ్మం పవర్ చూపించాలని తుమ్మల పిలుపునిచ్చారు. అభివృద్ధి నాయకులు, అహంకార నేతల మధ్య జరుగుతున్న పోటీలో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ అహంకార నాయకత్వానికి జనం విరామం ప్రకటించారని స్పష్టం చేశారు.