Pawan Kalyan: పవన్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. లైన్లోకి ఉస్తాద్ భగత్ సింగ్!

కొంతకాలంగా పాలిటిక్స్‌లో బిజీబిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. మళ్లీ మూవీస్‌పై ఫోకస్ చేశారు. ఆయన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) షూటింగ్, డబ్బింగ్ పూర్తిచేసిన పవన్.. ఇక OG, ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagat Singh) మూవీలను సైతం అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు వీలైనంత స్పీడుగా ఈ రెండు మూవీలను కంప్లీట్ చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ‘గబ్బర్ సింగ్’ తరవాత హరీశ్ శంకర్(Harish Shankar)-పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ గురించి క్రేజీ అప్టేడ్ వచ్చేసింది.

జూన్‌లో హైస్పీడుతో షూటింగ్

మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ ఈ చిత్రం కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మేకర్స్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులకు, జూన్ షెడ్యూల్‌(June Schedule)తో ఈ సినిమా మళ్లీ హై స్పీడ్‌లో వెళ్తుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ పవన్ మాస్ ఇమేజ్‌కు చక్కటి ప్రతిరూపంగా నిలిచింది. రెండు చేతులు కలిపే స్టైల్, డైనమిక్ డిజైన్‌తో విడుదలైన ఈ పోస్టర్(poster) మాస్ హైప్‌ను మళ్లీ రెట్టింపు చేసింది.

అభిమానులకు బాక్సాఫీస్ పండగే..

కాగా ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) కథానాయికగా నటిస్తుండగా,రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి పవన్ స్టైల్‌కు తగినట్లు స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు సమాచారం. పవన్ రాజకీయ స్థాయిలో ప్రజలతో కలిసే మార్గం, ఆయన నమ్మకాలు, వీటికి తగ్గట్లు కథ రూపొందించారని బజ్ ఉంది. హరీశ్ శంకర్ కూడా మళ్లీ తన మార్క్ డైలాగ్ రైటింగ్‌తో పవన్ అభిమానులకు బాక్సాఫీస్(Box Office) పండగ చూపించనున్నట్లు సమాచారం. కాగా పవన్ మరోవైపు OG సినిమాకు కూడా ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో వచ్చే అవకాశం ఉంది.

Ustaad Bhagat Singh Teaser: Makers Drop Power-Packed Bhagat's Blaze from  Pawan Kalyan Starrer

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *