తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్-9(Bigg Boss 9) సీజన్ వచ్చేస్తోంది. ఈ షోకు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ గత సీజన్లను బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్-9కి సంబంధించి ‘స్టార్ మా(Star Maa)’ ప్రోమో(Promo) రిలీజ్ చేసింది. ఈసారి కూడా హోస్టుగా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వ్యవహరించనున్నారు. ఈ మేరకు నాగ్ ఎంట్రీతో రిలీజ్ చేసిన ప్రోమోలో.. ‘ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు. కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే’ అంటూ నాగ్ డైలాగ్స్‌తో రిలీజ్ చేసిన ప్రోమో బిగ్ బాస్-9పై అంచనాలు పెంచేసింది. ఈ ప్రోమోతో బిగ్ బాస్-9 హోస్ట్(Bigg Boss-9 Host) ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసింది.
Ee sari chadharangam kaadu ranarangame 👑🔥👁️#BiggBossSeason9 Coming Soon on #StarMaa #BiggBossSeason9ComingSoon#BiggBossTelugu #BiggbossTelugu9 pic.twitter.com/r1tbknHviN
— Starmaa (@StarMaa) June 26, 2025
సీజన్-8లో జరిగిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ కాకుండా
ఇక సీజన్-8లో జరిగిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ కాకుండా షో రేటింగ్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి క్రేజీ కంటెస్టెంట్లని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొందరు కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి. వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిలో పలువురు క్రేజీ స్టార్స్ ఉండటం విశేషం. లీకైన లిస్ట్ ప్రకారం తొమ్మిదో సీజన్‌కి రాబోతున్న కంటెస్టెంట్లు వీరే అని కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్-9 కంటెస్టెంట్లు వీరేనా?
వీరిలో మై విలేజ్ షో ఫేమ్ అనిల్ గీల(Anil Geela), సీరియల్ యాక్టర్ కావ్య(Kavya), రీతు చౌదరి(Reethu Chowdary), ప్రదీప్(Pradeep), శివ కుమార్(Shiv Kumar), బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక(Deepika), జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్(Emmanuel), సీరియల్ యాక్టర్ సీతాకాంత్(Seetha Kanth), ప్రియాంక జైన్ లవర్ శివ్ కుమార్(Shiv Kumar), అలేఖ్య(Alekhya)(అలేఖ్య చిట్టి పికిల్స్), అమర్ తేజ్ వైఫ్ తేజస్విని గౌడ(Tejaswini Gowda), సీరియల్ హీరోయిన్ దేబ్‌జాని(Debjani), కేరింత హీరో సుమంత్ అశ్విన్(Sumanth Ashwin), సీరియల్ యాక్టర్స్ హారిక(Harika), ఏక్‌నాథ్(Eknadh)ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram








