Mana Enadu : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 8(Bigg Boss 8) ఏడు వారాలు కంప్లీట్ చేసుకుంది. ఇక ఎనిమిదో వారం చివరి రోజుకు చేరుకుంది. ఇవాళ ఆదివారం కావడంతో హౌసులో నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యారు. గత వారం నాగమణికంఠ(Manikantha) హౌజ్ నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఉత్కంఠ మొదలైంది.
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని ఉన్నారు. నామినేషన్(Bigg Boss 8 Nominations)లో ఉన్నారు. తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో మెహబుబ్, నయన్ పావనిలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇవాళ్టి ఎపిసోడ్ లో తెలియనుంది. అయితే ఈ ఇద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారే కావడం గమనార్హం.
దీపావళి సెలబ్రేషన్స్ అదుర్స్
ఇక తాజాగా బిగ్ బాస్ దీపావళి స్పెషల్ ప్రోమో(Bigg Boss Diwali Promo) రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో హౌజ్‌మేట్స్ అంతా కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక నాగార్జున కూడా హౌస్ మేట్స్ తో సరదాగా గడిపారు. ఇక దీపావళి ఎపిసోడ్ కు ‘అమరన్’ మూవీ టీమ్ నుంచి సాయి పల్లవి(Sai Pallavi), శివ కార్తికేయన్ వచ్చారు. ఇక ‘లక్కీ భాస్కర్ (Lucky Bhaksar)’ మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ కు వచ్చింది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, మీనాక్షి చౌదరి వీకెండ్ ఎపిసోడ్లో సందడి చేశారు.
బిగ్ బాస్ లోకి మూవీ స్టార్స్
వీరితో పాటు అనసూయ కూడా తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఇక ‘క’ (K Movie) మూవీ టీమ్ నుంచి కిరణ్ అబ్బవరం, నయన్ సారిక సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తో నాగార్జున ఫన్నీ గేమ్స్ ఆడించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా అని ప్రేక్షకులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరోననే ఉత్కంఠతో ఉన్నారు.






