Mana Enadu : విమాన ప్రయాణం(Flight Journey) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అందరికీ అది అందుబాటులో ఉండదు. కారణం ఆకాశాన్నంటే టికెట్ల ధరలు. మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మందికి విమానంలో ప్రయాణించడమనేది ఒక పెద్ద కల. అయితే ఇప్పుడు కేవలం మూడు వేల రూపాయలకే విమానంలో ప్రయాణించవచ్చు. అది కూడా విశాఖపట్నం నుంచి విజయవాడ(Visakha To Vijayawada)కు వెళ్లొచ్చు. మరి ఎందుకింక ఆలస్యం.. ఆ వైపునకు వెళ్లాలంటే హాయిగా ఆకాశాంలో తేలుతూ విమాన ప్రయాణం చేయండి.
విశాఖ – విజయవాడ విమాన సర్వీసులు
విశాఖపట్నం – విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammihan Naidu) విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసును ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ టు విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారని తెలిపారు.
ఇదే తొలిసారి
“ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు ఫ్లైట్లు ప్రారంభం కావడం బహుశా ఇదే మొదటిసారి. 2 నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు(Plane Ticket Price) తగ్గుతాయి. విశాఖ విజయవాడ మధ్య రూ.3000కే టికెట్ దొరికే అవకాశం ఉంది.” అని తెలిపారు. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ – విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య 3కు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
విశాఖ – విజయవాడ విమాన సర్వీసుల వివరాలు
- ఎయిర్ ఇండియా(Air India) ఎక్స్ప్రెస్ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరి.. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ రీచ్ అవుతుంది.
- ఇండిగో సర్వీసు(Indigo Service) రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ రీచ్ అవుతుంది.






