ప్రస్తుతం రోజులు మారాయ్.. ఇంట్లో, ఆఫీస్‌లో పని ఒత్తిడి(Work Pressure) పెరిగిపోయింది. అందుకు తగ్గట్లు ఆహారపు అలవాట్లూ(Food Habits) మారిపోయాయి. అన్నింటికంటే ముఖ్యంగా లేటు వయసు పెళ్లిళ్లు(Late age marriages) జరుగుతున్నాయి. దీంతో చాలా మంది సంతాస సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టెలీగ్రాం సీఈవో పావెల్ దురోవ్ (Telegram CEO Pavel Durov) ఆసక్తికర ఆఫర్ ఇచ్చారు. పిల్లలు కావాలనుకునే వారికి తాను స్పెర్మ్(Sperm)ను ఇవ్వడమే కాకుండా.. మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్(IVF) చికిత్స అందిస్తానని ప్రకటించారు. పైగా తనకి ఈ ఆలోచన ఎందుకో ఎందుకొచ్చిందో కూడా చెప్పాడు పావెల్. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది.
దీని వెనుక బలమైన కారణం
టెలీగ్రాం సీఈవో పావెల్ దురోవ్(Telegram CEO Pavel Durov). ఇతనికి మ్యారేజ్(Marriage) అవ్వలేదు. కానీ తన వీర్యం ద్వారా ఇప్పటివరకే ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రి అయ్యారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని పావెల్ చెప్పుకొచ్చాడు. 15 ఏళ్ల క్రితం తాను 24 ఏళ్ల వయసులో ఉన్నపుడు.. తన ఫ్రెండ్ చెప్పిన ఒక విషయంతో తాను ఈ వీర్య దానం చేయడం ప్రారంభించినట్లు చెప్పాడు. అయితే తన ఫ్రెండ్‌కు, అతని భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు(Doctors) చెప్పారని అప్పుడే తాను స్పెర్ డోనేట్(Donate sperm) చేయాలని నిశ్చయించుకున్నాని తెలిపాడు.

ఐపీఎఫ్ కోసం ఫెర్టిలిటీ క్లినిక్‌తో ఒప్పందం
అయితే దీని తర్వాత టెలిగ్రామ్ యాప్(Telegram App) ద్వారా డ్రగ్స్ సరఫరా, చైల్డ్ సెక్సువల్ కంటెంట్, చీటింగ్ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో ఈ యాప్ విఫలమైంది. దీంతో పావెల్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత కండిషన్స్‌తో బెయిల్ మీ బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఈ వింత ఆఫర్(Offer)ను తెర మీదకు తెచ్చాడు. పైగా దీని కోసం ఆల్ట్రావిటా ఫెర్టిలిటీ క్లినిక్(Ultravita Fertility Clinic)తో దురోవ్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. ఈ విషయాన్ని ఆల్ట్రావిటా క్లినిక్ వెల్లడించింది. ఇదండీ టెలీగ్రాం CEO ఇచ్చిన వింత ఆఫర్.. దీనిపై మీరేమంటారు?.







