ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Delhi Assembly Election Results 2025) బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ తన జోరు చూపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ (BJP) 45 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఆప్ (AAP) 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 77 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది.
కార్యకర్తల సంబురాలు
ఈ నేపథ్యంలో బీజేపీ (BJP Victory in Delhi) విజయం దిశగా దూసుకెళ్తున్నట్టే. ఇప్పటికే ఈ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. మిఠాయిలు పంచుతూ.. టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే బీజేపీ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు?
దిల్లీ ముఖ్యమంత్రి (Delhi BJP CM Candidate) అభ్యర్థిగా బీజేపీ నేత పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Kejriwal) పోటీ చేసిన న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ పర్వేశ్ వర్మను (Parvesh Verma) రంగంలోకి దింపింది. మొదటి నుంచి ఈ ఇద్దరి మధ్య దోబూచులాట కనిపిస్తోంది. ఓసారి కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉంటే.. మరోసారి పర్వేశ్ వర్మ ముందంజలో ఉంటున్నారు. ఈ క్రమంలో 8 రౌండ్లు ముగిసేసరికి 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు. ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది.






