Statue of Lady Justice: న్యాయదేవత కళ్లు తెరిచింది.. చట్టానికీ కళ్లున్నాయ్!

ManaEnadu: న్యాయ దేవత(Statue of Lady Justice) కళ్లు తెరిచింది. అవును.. మీరు విన్నది నిజమే. ఇన్ని రోజులు కళ్లకు గంతలు(Blindfold) కట్టుకొని, కుడిచేతిలో త్రాసు(Flail in right hand), ఎడమ చేతిలో ఖడ్గం(sword in left hand)తో కనిపించిన న్యాయదేవత ఇకపై అలా కనిపించదు. పైగా చట్టాని(Law)కి కళ్లు లేవు అనే మాట కూడా ఇకపై వినిపించదు. తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court)లోని జడ్జీల లైబ్రరీ(judges’ library)లో ఏర్పాటు చేసిన న్యాయదేవత కళ్లకు గంతలు తొలగించారు. ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగాన్ని పెట్టారు. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో లేడీ ఆఫ్ జస్టిస్ కొత్త విగ్రహం కళ్లకు గంతలు తొలగించడంపై చర్చనీయాంశంగా మారింది. చట్టం గుడ్డిది కాదని చెప్పడం దీని ఉద్దేశం.

 సమానత్వాన్ని సూచించేందుకే..

సాధారణంగా న్యాయదేవత కుడిచేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉంటాయి. త్రాసు న్యాయానికి ప్రతిబింబంగా, ఖడ్గం తప్పు చేసినవారికి శిక్ష తప్పదనే ఉద్దేశాన్ని చెప్పేవి. అయితే తాజాగా ఎడమచేతిలోకి రాజ్యాంగం వచ్చింది, కళ్లకు గంతలు తొలగించారు. కళ్లకు గంతలు చట్టం ముందు సమానత్వాన్ని(equality) సూచించడానికి ఉద్దేశించిందని తెలుస్తోంది. న్యాయస్థానాల ముందుకు వచ్చే వారి సంపద, అధికారం లేదా ఇతర హోదా గుర్తు(not be influenced by the status)లను పట్టించుకోదని ఈ విషయం సూచిస్తుంది. ఖడ్గం అధికారాన్ని, అన్యాయాన్ని శిక్షించే శక్తిని సూచిస్తుంది.

 బలమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం: CJS డీవై చంద్రచూడ్

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(Chief Justice of India DY Chandrachud) ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులోని న్యాయమూర్తు(judges)ల లైబ్రరీలోని కొత్త విగ్రహాని కళ్లు తెరిచి, ఎడమచేతిలో రాజ్యాంగాన్ని పెట్టారు. న్యాయం గుడ్డికాదని, చట్టానికి కళ్లున్నాయ్ అని చెప్పే బలమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లైబ్రరీలోని న్యాయదేవత విగ్రహానికి మార్పులు చేశారు. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సంబంధించిన ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం, భారతదేశం బ్రిటిష్ వలస పాలన ఛాయల నుంచి ముందుకు సాగాలని, చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, అది అందరినీ సమానంగా చూస్తుందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

Share post:

లేటెస్ట్