‘స్పిరిట్’కు బాలీవుడ్ టచ్.. ప్రభాస్ అన్న పాత్రలో స్టార్ హీరో!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజాసాబ్, హను రాఘవపూడితో చేస్తున్న సినిమాలపై ప్రస్తుతం డార్లింగ్ ఫోకస్ పెట్టాడు. ఈ రెండు చిత్రాల తర్వాత రెబల్ స్టార్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పనులు పూర్తయినట్లు సమాచారం. ఉగాది పర్వదినాన ఈ మూవీ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం స్పిరిట్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.

Image

స్పిరిట్ మూవీ లేటెస్ట్ బజ్

స్పిరిట్ (Spirit Movie) సినిమాను సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా రేంజులో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్త్ మార్కెట్ కోసం హిందీ స్టార్లను ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడిని సంప్రదించాడు. ఆ స్టార్ హీరో ఈ చిత్రంలో ప్రభాస్ కు అన్నగా నటించనున్నట్లు ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో కాదు.. ఇప్పటికే కేజీయఫ్ (KGF), డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలతో టాలీవుడ్ తెరపై విలనిజం చూపించిన సంజయ్ దత్.

Image

ప్రభాస్ అన్నగా బాలీవుడ్ స్టార్

స్పిరిట్ సినిమాలో సంజయ్ దత్ Sanjya Dutt) ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇందులో డార్లింగ్ కు అన్నగా నటించనున్నట్లు సమాచారం. సంజయ్ దత్ కాకుండా ఇంకా పలు ఇండస్ట్రీలకు చెందిన కీలక నటులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ సందీప్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ప్రభాస్ తన సినిమా కెరీర్ లో పోలీసుగా నటించడం ఇదే తొలిసారి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *