బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘రామాయణ(Ramayana)’ గురించి కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చాయి. నితీశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల మహాకావ్య చిత్రంలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. ఈ చిత్రం రూ.1600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. తొలి భాగానికి రూ.900 కోట్లు, రెండో భాగానికి రూ.700 కోట్లు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ‘రామాయణ’ నిలవనుంది.
ఒక్కో భాగానికి రూ.75 కోట్లు?
తాజా సమాచారం ప్రకారం.. రెండు పార్టులుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్ర కోసం ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం(Remunaration) అందుకుంటున్నారట. ఒక్కో పార్టుకు రూ.75 కోట్ల చొప్పున ఈ రెమ్యూనరేషన్ ఉంటుందని ఫిల్మ్‌ఫేర్ నివేదిక(Filmfare Report) పేర్కొంది. మరోవైపు, సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి రూ.6 కోట్ల చొప్పున మొత్తం రూ.12 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెమ్యూనరేషన్ ఆమె సాధారణ ఫీజు కంటే రెట్టింపుగా ఉందని సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకునేలా..
కాగా ఈ చిత్రంలో యష్(Yash) రావణుడిగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్(AR Rehman) సంగీతంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రం భారతీయ సినిమా సరిహద్దులను మరింత విస్తరించనుందని అభిమానులు(Fans) ఆశిస్తున్నారు.
#Ramayana is making records of the most expenses for a movie by miles!
The first part is made on a budget of Rs 900cr. Meanwhile, the second film will be made at a cost of Rs 700 crore.
Do you think the film can recover such a huge budget?#RanbirKapoor #Yash #NamitMalhotra pic.twitter.com/JBBgHBk2S3
— Inside Box Office (@InsideBoxOffice) July 6, 2025






