దక్షిణాఫ్రికా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ వియాన్ ముల్డర్(Wiaan Mulder) జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన రెండో టెస్ట్‌లో అరుదైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి, క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. కెప్టెన్(Captain)గా తన తొలి మ్యాచ్‌లోనే 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ (367 నాటౌట్) సాధించి, 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్ర(History of Test Cricket)లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ స్కోరు దక్షిణాఫ్రికా(South Africa) తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.
334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 367 పరుగులు
కాగా, ముల్డర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 367 పరుగులు చేసి, బ్రియాన్ లారా(Brian Lara) రికార్డు (400*)కు చేరువైనప్పటికీ, లారా ఒక లెజెండ్ అని, ఆయన మీద గౌరవంతోపాటు జట్టు విజయం కోసం ఇన్నింగ్స్‌ను డిక్లేర్(Declare) చేశాడు. ఈ నిర్ణయం జట్టు ప్రయోజనాలను వ్యక్తిగత రికార్డులకు పైగా ఉంచిన క్రీడాస్ఫూర్తి(Sportsmanship)కి నిదర్శనం. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలడంతో, దక్షిణాఫ్రికా 456 పరుగుల ఆధిక్యం సాధించి ఫాలో-ఆన్(Follow-on)ను అమలు చేసింది.
“Let the legends keep the really big scores” – Wiaan Mulder on declaring the innings even though had the opportunity to break Brian Lara’s record of 400. #ZIMvSA pic.twitter.com/M5ZV7vgoyY
— Aryan (@chinchat09) July 8, 2025
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం
దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన ఈ 26 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాడిగా ఐపీఎల్(IPL)లోనూ రాణిస్తున్నాడు. టెంబా బవుమా(Temba Bavuma), కేశవ్ మహరాజ్(Keshav Maharaj) గాయాలతో జట్టుకు దూరమవ్వడంతో ముల్డర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, అతడు తన నాయకత్వంతో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఘనత సౌతాఫ్రికా క్రికెట్‌లో నూతన ఆశలను రేకెత్తిస్తోంది.
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే..
☛ లారా (400 నాటౌట్; ఇంగ్లాండ్‌పై 2004లో)
☛ హేడెన్ (380; జింబాబ్వేపై 2003లో)
☛ లారా (375; ఇంగ్లాండ్‌పై 1994లో)
☛ జయవర్దనే (374; దక్షిణాఫ్రికాపై 2006లో)
☛ ముల్డర్ (367 నాటౌట్; జింబాబ్వేపై 2025లో)
Wiaan Mulder provides some insight on why he chose not to chase Brian Lara’s record for the highest score in Test cricket 🙌#ZIMvSAhttps://t.co/LAlxf5MgPs
— ICC (@ICC) July 8, 2025






