Mana Enadu : చామకూర మల్లారెడ్డి (Malla Reddy).. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సంపాదించినా అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలా సార్లు ఆయన మాట్లాడిన మాటలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అంతే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తనలోని కళాకారుణ్ని బయటకు తీస్తారు. పార్టీ సంబురాల్లో, తన కాలేజీ ఫంక్షన్లల్లో, ఇతర కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు.
తాజాగా ఆయన మరోసారి స్టెప్పులేసి అదరగొట్టారు. డీజే టిల్లు పాటల(DJ Tillu Songs)కు హుషారైన స్పెప్పులేస్తూ నెట్టింట మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఈసారి ఎక్కడ డ్యాన్స్ చేశారంటే..
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) కుమార్తె వివాహం ఈ నెల 28వ తేదీన జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ జరుగుతున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో మల్లారెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
75 ఏళ్ల వయసులోనూ మల్లారెడ్డి కుర్రాడిలా మాస్ డ్యాన్సుతో అదరగొట్టారు. కొరియోగ్రాఫర్లు, మనవళ్లను పక్కన బెట్టుకుని అదిరిపోయే స్టెప్పులేశారు(Malla Reddy Dance Video). డీజే టిల్లు పాటలకు ఊర మాస్ డ్యాన్స్ చేసి.. మల్లారెడ్డి స్టెప్పులు చూసి అక్కడున్న వాళ్లంతా విజిల్స్ వేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘టిల్లన్న కంటే మా మల్లన్న డ్యాన్స్ ఏమాత్రం తక్కువ లేదు’ అంటున్నారు. ఇక ఈ డ్యాన్స్ కోసం మల్లారెడ్డి కొరియోగ్రాఫర్ల వద్ద ట్రైనింగ్ కూడా తీసుకున్నారట.
https://twitter.com/Vardhavelly/status/1848243127133614541