సల్మాన్ ఖాన్ ను బెదిరించి తప్పు చేశా.. నిందితుడి మరో మెసేజ్

Mana Enadu : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశానని.. ఇందుకు తనను క్షమించాలని కోరుతూ మొదట తాను బెదిరించిన నంబర్‌ నుంచే ముంబయి పోలీసులకు మళ్లీ వాట్సాప్‌ మెసేజ్ చేశాడు.

అలా చేయకపోతే దారుణంగా చంపుతాం

సల్మాన్‌ ఖాన్‌ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య తామే చేసినట్లు బిష్ణోయ్‌ గ్యాంగ్ ప్రకటించగా.. ఈ క్రమంలోనే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తూ అక్టోబర్‌ 18  సల్మాన్‌ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఓ వ్యక్తి ఓ మెసేజ్‌ పంపించాడు. అలా చేయకపోతే సిద్ధిఖీ కంటే దారుణ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు.

నన్ను క్షమించండి తప్పు చేశా

దీన్ని తీవ్రంగా పరిగణించిన ముంబయి పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా..  అదే నంబర్‌ నుంచి తాజాగా ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు నేడు (అక్టోబర్‌ 21) మరో మెసేజ్‌ వచ్చింది. సల్మాన్‌కు బెదిరింపు సందేశం పంపి తప్పుచేశానని, తనను క్షమించాలని అందులో పేర్కొన్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ మెసేజ్‌లు జార్ఖండ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు అక్కడకు వెళ్లాయని వెల్లడించారు.

Share post:

లేటెస్ట్