Telangana Discoms: విద్యుత్ వినియోగదారులకు షాక్.. ఛార్జీలు పెంచే యోచనలో డిస్కంలు!

Mana Enadu: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు విద్యుత్ సంస్థలు(Power Distribution companies) సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థలు ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ( Electricity Regulatory Commission)కి నివేదక అందజేశాయి. తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్ సంస్థలు ERCని కోరాయి. అయితే దీనిపై బహిరంగ విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

 మూడు కేటగిరీల్లో ఛార్జీల సవరణ

ఇప్పటికే రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు 3 కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. వీటిని ERC ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి రూ.1200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలోని ఉత్తర, దక్షిణ డిస్కం(Northern and southern Discoms)లు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.14,222 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి. ఈ మొత్తంలో రూ.13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌(Budget) ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలిన రూ.1200 కోట్ల లోటు పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ(Revision of charges) ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి.

 పరిశ్రమలపైనా స్థిర ఛార్జీలు పెంపు?

ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300Units దాటితే కిలోవాట్‌కు స్థిర ఛార్జీని ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తుండగా, రూ.50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. గృహజ్యోతి(Gruha Jyothi scheme) కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంట్ వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిరచార్జీ పెంపు ఉండదు. మరోవైపు అన్ని కేటగిరీల పరిశ్రమల(industries) నుంచి ఇకపై యూనిట్‌కు 7.65 రూపాయల చొప్పునే వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. పరిశ్రమల నుంచి కిలోవాట్‌కు రూ.475 చొప్పున వసూలు చేస్తున్న స్థిర ఛార్జీని రూ.500లకు పెంచాలని కోరాయి.

Related Posts

Bhairavam OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ చిత్రం జులై 18 నుంచి ZEE5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *