
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి (Mallareddy) రాజకీయ నేతగానే కాదు.. సోషల్ మీడియాలోనూ పాపులర్. అసెంబ్లీ అయినా.. ప్రెస్ మీట్ లో అయినా.. సినిమా ఈవెంట్లో అయినా ఆయన మాట్లాడితే పంచ్ పడాల్సిందే. నవ్వులు పూయాల్సిందే. అయితే తాజాగా ఆయన ఓ సినిమా ఈవెంట్ కు గెస్టుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ ను ఉద్దేశిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మల్లారెడ్డిపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి
ఈ హీరోయిన్ పేరు కసికపూర్ అంట, కసి కసిగా ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి.#mallareddy #latestnews #NewsUpdate @PoliticsIcon pic.twitter.com/8HGAPy9aLW
— Icon Politics (@PoliticsIcon) March 29, 2025
కశిక కపూర్.. కసికసిగా
నటుడు శ్రీహర్ష హీరోగా పవన్ కేతరాజు ‘లవ్ యువర్ ఫాదర్ (Love Your Father)’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy Heroine COntroversy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా హీరోయిన్ పై అనుచిత కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో కశికా కపూర్ కథానాయికగా నటించింది. అయితే ఆమె గురించి మాట్లాడుతూ.. కశికా కపూర్.. కసికసిగా ఉందంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.
మల్లన్నా.. ఏందన్నా
ఈ నేపథ్యంలో మల్లారెడ్డి (Mallareddy Controversy Latest) కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటమేంటని ఏకిపారేస్తున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఎమ్మెల్యే అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడటం ఎంత వరకు కరెక్టు అంటూ కడిగిపారేస్తున్నారు. ఇలా మాట్లాడుతూ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.