బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నేతలందరికీ ఫాంహౌస్‌కు రావాల్సిందిగా కేసీఆర్ పిలుపునిచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇవాళ్టి భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇవాళ్టి భేటీలో కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions 2025) అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఏప్రిల్ 27న BRS బహిరంగ సభ
మరోవైపు ఏప్రిల్ 27వ తేదీన బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్‌లో BRS ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా.. వరంగల్‌లో బహిరంగ సభకు ప్రణాళికలు చేస్తున్నారు.







