BSNL: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. టారిఫ్‎లు పెంచేది లేదని వెల్లడి

Mana Enadu: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(Bharat Sanchar Nigam Limited) మరింత మంది కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా 4G నెట్ వర్క్ విస్తరణ, 5జీ ప్రారంభానికి ముందు BSNL లోగోలో ఇటీవల కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇప్పట్లో టారిఫ్ ఛార్జీలు(Tariff charges) పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే టెలికాం దిగ్గజాలు JIO, AIRTEL, వొడాఫోన్, IDEAలు టారిఫ్ ఛార్జీలను 30% మేర పెంచిన సంగతి తెలిసిందే.

ధరలను పెంచాలనుకోవడం లేదు: సంస్థ CMD

ఈ నేపథ్యంలోనే BSNL స్పందించింది. ఈ అంశంపై ఆ సంస్థ CMD రాబర్ట్ రవి మాట్లాడారు. ఇప్పడుగానీ, సమీప భవిష్యత్తులోగానీ రీఛార్జ్ ధరలను పెంచాలనుకోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా కాల్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు, సంస్థపై వారి విశ్వాసాన్ని గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే కంపెనీకి చెందిన కొత్త లోగో(New LOGO)ను టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia)తో ఆవిష్కరింపచేసినట్లు ఆయన వివరించారు.

స్పామ్ SMSలు, CALLSను గుర్తించేలా..

వచ్చే ఏడాది లక్ష 4G సైట్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు భవిష్యత్తులో 5Gగా మారనున్నాయని మంత్రి సింధియా తెలిపారు. స్పామ్ రహిత నెట్ వర్క్‌ను అందించేందుకుగాను సంస్థ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. స్పామ్ SMSలు, CALLSను ముందుగా గుర్తించి ఆటోమెటిగ్గా వాటిని బ్లాక్ చేస్తుందన్నారు. కాగా, BSNL ప్రస్తుతం 4జీ సేవలను దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెట్‌వర్క్‌(Network)ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక 5జీ నెట్‌వర్క్‌ను అందించడానికి సీ-డాక్‌తో BSNL భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Share post:

లేటెస్ట్