Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌కు కొత్త రూల్స్‌.. ఈ పథకాల నిబంధనల్లో మార్పులు

మ‌న ఈనాడుః కొన్ని రకాల స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌ల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), రికరింగ్ డిపాజిట్ (RD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, కిసాన్ వికాస్ పత్ర వంటి తొమ్మిది రకాల స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లను ప్రభుత్వం అందిస్తోంది.

అయితే వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్‌ నియమాలు మారాయి. పెట్టుబడిదారులు తమ డబ్బును వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా, మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. కొత్త నిబంధనలు చూద్దాం.

* రికరింగ్ డిపాజిట్ (RD)

రికరింగ్ డిపాజిట్ (RD) ముందుగా నిర్ణయించిన వ్యవధిలో సిస్టమేటిక్‌ డిపాజిట్‌ని సృష్టించే ఉద్దేశ్యంతో పనిచేస్తుంది. 5, 10 లేదా 15 సంవత్సరాల టర్మ్స్‌తో, సంవత్సరానికి 7.5% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. కనీస నెలవారీ పెట్టుబడి మొత్తం రూ.100, వడ్డీ ఆదాయంపై పన్ను విధిస్తారు.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకాన్ని దీర్ఘకాలిక పొదుపులు, ముఖ్యంగా పదవీ విరమణ కోసం రూపొందించారు. 15 సంవత్సరాల కాలవ్యవధితో వస్తుంది, ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.1%. కనీసం రూ.500 వార్షిక పెట్టుబడి అవసరం. వడ్డీ ఆదాయం మెచ్యూరిటీపై మాత్రమే పన్ను విధిస్తారు.

 

Share post:

లేటెస్ట్