తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులకు పట్టుబడుతున్న నోట్ల కట్టలను గుట్టలుగా పేరుస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు పట్టుబడిన నగదు పోలీస్ స్టేషన్లోనే రూ.500నోట్ల కట్టల బండిల్స్ టేబుల్‌పై పేర్చారు.
కొండాపూర్ బోటానికల్ రోడ్ బ్రెజా కారులో పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో రూ.5కోట్ల మేర పట్టుబడింది. ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఓ ప్రధాన వ్యాపారవేత్తకు సంబంధించిన సోమ్ముగా గుర్తించిన పోలీసులు ఎన్నికల సమయంలో ఇంత పెద్దమొత్తంలో నగదు తరలించాల్సిన అవసరం ఏంటి అని దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రధాన రాజకీయపార్టీ నాయకుడితో సంబంధాలు ఉన్నాయనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఐటీ అధికారులకు సమాచారం అందించి క్యాష్ అప్పగించారు.