Bengaluru Incident : యాక్సిడెంట్ కాదు మర్డర్.. సంచలన నిజం బయటపెట్టిన సీసీటీవీ ఫుటేజీ

CCTV Footage Reveals Truth : ప్రమాదంలో (హిట్ అండ్ రన్) చనిపోయాడని అంతా అనుకున్నారు. హిట్ అండ్ రన్ గా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కానీ, డ బయటపడింది.

బెంగళూరులో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. మృతుడి కుటుంబసభ్యులనే కాదు స్థానికులను, పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. సీసీటీవీ ఫుటేజీ సంచలన నిజాన్ని బయటపెట్టింది. అది ప్రమాదం కాదు మర్డర్ అని తేలింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో ఓ వృద్ధుడు వివి కృష్ణప్ప(77) ఇటీవల మరణించాడు. ప్రమాదంలో (హిట్ అండ్ రన్) ఆయన చనిపోయాడని అంతా అనుకున్నారు. హిట్ అండ్ రన్ గా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కానీ, కట్ చేస్తే.. అది ప్రమాదం కాదు హత్య అని బయటపడింది.

మృతుడు కృష్ణప్ప నార్త్ వెస్ట్ బెంగళూరులోని ప్యాలెస్ గుట్టహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటారు. నవంబర్ 16న మందులు తీసుకురావడానికి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. సమీపంలోని షాపులో మందులు కొనుగోలు చేసి తిరిగొచ్చారు. పార్కింగ్ ఏరియాలోకి రాగానే ఓ బైకర్ తన మోటర్ సైకిల్ ను ఢీకొట్టడం గమనించారు. వెంటనే కృష్ణప్ప.. తన మోటర్ సైకిల్ ని బైక్ తో గుద్దిన వ్యక్తి సర్ఫరాజ్ ఖాన్ దగ్గరికి వెళ్లాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. జాగ్రత్తగా బైక్ నడపాలని అతడితో చెప్పాడు.

కృష్ణప్ప అలా చెప్పడం సర్ఫరాజ్ ఖాన్ కు విపరీతమైన కోపం తెప్పించింది. వెంటనే చేతిలోకి రాయి తీసుకుని దాంతో వృద్ధుడి తలమీద బలంగా కొట్టాడు. దాంతో వృద్ధుడు రోడ్డు మీద కుప్పకూలాడు. రోడ్డు మీద పడున్న వృద్ధుడిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణప్ప మరణించాడు. అయితే, ఏదో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని, ఈ ఘటనలో కృష్ణప్ప చనిపోయి ఉంటారని, ఇదో యాక్సిడెంట్ అని అంతా అనుకున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఇంతలో వృద్ధుడి కొడుకు సతీశ్ కి సంచలన నిజం తెలిసింది. సడెన్ గా తండ్రి చనిపోవడంతో సతీశ్ షాక్ కి గురయ్యాడు. ఆ తర్వాత అతడు షాక్ నుంచి బయటకు వచ్చాడు. అసలేం జరిగింది? అనేది తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే మెడికల్ షాపులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ చెక్ చేయాలని నిర్ణయించాడు. ఫుటేజీ చెక్ చేయగా షాకింగ్ నిజం తెలిసింది. సర్ఫరాజ్ ఖాన్ రాయితో వృద్ధుడిని కొట్టి చంపడం వీడియోలో ఉంది. దీంతో అది ప్రమాదం కాదు హత్య అని తెలిసి సతీశ్ షాక్ కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు విషయం చెప్పాడు. దీంతో పోలీసులు సర్ఫరాజ్ ఖాన్ ని అరెస్ట్ చేశారు.

సర్ఫరాజ్ ఖాన్ ఓ దొంగ. బైక్స్ చోరీ చేస్తుంటాడు. పార్కింగ్ ఏరియాలో ఉంచిన మోటర్ సైకిల్ ను ఎత్తుకెళ్లే క్రమంలో కృష్ణప్ప మోటర్ సైకిల్ ను ఢీకొట్టాడు. అదే సమయంలో కృష్ణప్ప అక్కడికి రావడం, మందలించడం జరిగాయి. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను దొరికిపోతానేమో అనే భయంతో సర్ఫరాజ్ ఖాన్ వృద్ధుడిని రాయితో కొట్టి హత్య చేశాడు.

నిజానికి.. సర్ఫరాజ్ ఖాన్ దొంగ అనే విషయం కృష్ణప్పకి తెలియదు. తన మోటర్ సైకిల్ ను గుద్దాడని అతడిని మందలించాడు. అయితే, అప్పటికే బైక్ దొంగలించి పారిపోయే పనిలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. వృద్ధుడు తన దగ్గరికి వచ్చేసరికి భయపడ్డాడు. తాను ఎక్కడ పట్టుబడిపోతానో అని కంగారు పడ్డాడు. ఈ క్రమంలో కోపంతో రాయి తీసుకుని తలపై బలంగా కొట్టి వృద్ధుడిని చంపేశాడు.

నిజానికి.. సర్ఫరాజ్ ఖాన్ దొంగ అనే విషయం కృష్ణప్పకి తెలియదు. తన మోటర్ సైకిల్ ను గుద్దాడని అతడిని మందలించాడు. అయితే, అప్పటికే బైక్ దొంగలించి పారిపోయే పనిలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. వృద్ధుడు తన దగ్గరికి వచ్చేసరికి భయపడ్డాడు. తాను ఎక్కడ పట్టుబడిపోతానో అని కంగారు పడ్డాడు. ఈ క్రమంలో కోపంతో రాయి తీసుకుని తలపై బలంగా కొట్టి వృద్ధుడిని చంపేశాడు. వృద్ధుడు ప్రమాదంలో చనిపోలేదు బైక్ దొంగ చేతిలో హత్యకు గురయ్యాడు అని తెలిశాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Share post:

లేటెస్ట్