మన ఈనాడు: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
బెంగూళురులోని 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించి నకిలీవని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.
15 స్కూళ్లలో బాంబు పెట్టిన వార్తతో బెంగళూరు ఉలిక్కిపడింది. విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్ధులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. స్కూల్ గ్రౌండ్‌లో పేలుడు పదార్ధాలు ఉంచినట్లు మెయిల్‌లో బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు డిస్పోజల్ స్క్వాడ్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి పేలుడు పదార్ధం కనపడకపోవడంతో ఇదంతా ఫేక్ అని తేల్చారు. అయినా కూడా మెయిల్స్ పంపిన నిందితుల్ని కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద్ చెప్పారు.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ పాఠశాలలను సందర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోంమంత్రి జి.పరమేశ్వర సైతం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు
Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…