ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో(Rapido) ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగం(Online food delivery sector)లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు బెంగళూరులో ‘ఓన్లీ’ (Ownly) పేరిట కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ర్యాపిడో ఈ రంగంలో స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato)లకు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వావ్!, ఈట్‌ఫిట్, క్రిస్పీ క్రీం వంటి ప్రముఖ బ్రాండ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ర్యాపిడో, రూ.150 లోపు ధరలతో ఆహార పదార్థాలను అందించనుంది.

8-15% మాత్రమే కమీషన్ వసూలు
ర్యాపిడో ఈ విభాగంలో తక్కువ కమీషన్(Low Commission) విధానంతో రెస్టారెంట్ యజమానులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. స్విగ్గీ, జొమాటో 15-30% కమీషన్ వసూలు చేస్తుండగా, ర్యాపిడో కేవలం 8-15% మాత్రమే వసూలు చేయనుంది. రూ.400 కంటే తక్కువ విలువైన ఆర్డర్‌లపై రూ.25, అంతకంటే ఎక్కువ విలువైనవాటిపై రూ.50 కమీషన్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ వ్యూహంతో రెస్టారెంట్లకు లాభదాయకమైన ఎంపికగా నిలవాలని ర్యాపిడో భావిస్తోంది.
Rapido launches pilot of its standalone food delivery app Ownly in Koramangala & HSR Layout, Bengaluru
Rapido will follow a three tier flat pricing model with Rs 20 for orders up to Rs 100, Rs 25 plus GST for Rs 100 to 400
Read more @entrackr #Rapido https://t.co/xlkboPAxmO
— Shailesh Mahato (@8M_Shailesh) August 13, 2025
ప్రస్తుతం 500 నగరాల్లో సేవలు
2015లో బైక్ ట్యాక్సీ(Bike Taxi) సేవలతో ప్రారంభమైన ర్యాపిడో, దశాబ్దంలోనే రైడ్ షేరింగ్(Ride Sharing) రంగంలో రెండో స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం 500 నగరాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ, 2026 నాటికి దేశవ్యాప్తంగా మరిన్ని నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ర్యాపిడో ఎంట్రీతో ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రతరం కానుంది, వినియోగదారులకు మరింత ఎంపికలు, తక్కువ ధరల్లో లభించే అవకాశం ఉంది.






