బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోలుగా ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వార్2(War2)’. ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ మూవీపై అంచనాలు పెంచేశారు. “ఇది యుద్ధం. ఇవాళ థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్2 పట్ల గర్వంగా ఉంది. దీనిపై మీ రియాక్షన్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీకు సమీపంలోని సినిమాహాళ్లలో మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి!” అంటూ ట్వీట్ చేశారు.
“కొడుతున్నాం అన్న” అంటూ కామెంట్స్
దీంతో అభిమానుల అంతా “కొడుతున్నాం అన్న” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్(Bollywood)కు పరిచయమైతే.. హృతిక్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బాలీవుడ్ పాప్యులర్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్(Yash Raj Films) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందించిన ‘వార్2’ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. కాగా, మరికొన్ని గంటల్లో ఈ మూవీ ఎలా ఉందనే విషయం తెలిసిపోనుంది.
THIS IS WAR 🔥🚨 There will be CARNAGE in theatres today. Proud of #War2 and can’t wait to see your reactions to this entertainer. Only in cinemas near you in Hindi, Telugu & Tamil.
Book your tickets now! https://t.co/5uc5EmwumW | https://t.co/lXCDuadpTC @ihrithik… pic.twitter.com/QSIry9JRN9
— Jr NTR (@tarak9999) August 13, 2025






