Mana Enadu: సాధారణంగా భార్యభర్తల(Wife&Husband) మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి సరదా సరదా పొట్లాడుకుంటారు. ఇంకొన్ని సార్లు వారిద్దరికీ సర్ది చెప్పేందుకు మూడో పర్సన్ వచ్చి వారికి సర్ది చెప్పాల్సి వస్తుంది. తాజాగా హరియాణా(Haryana)లో వింత కారణంతో భార్యభర్తలు కోర్టుకెక్కారు. ఇద్దరు గొడవ పడ్డారు. అంత వరకూ బాగానే ఉన్నా.. వారి మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో భార్య తన భర్తను హిజ్రా(Hijra) అంటూ తిట్టిందట. ఇంకేముంది నాలుగు గోడల మధ్య ఉండాల్సిన పరువు కాస్త హైకోర్టు(Highcourt) వరకూ చేరింది. ఇంతకీ విషయమేంటో తెలుసుకుందాం పదండి..
2017లో వివాహం
హరియాణాకు ఇద్దరు యువతీయువకుడు 2017లో వివాహం(Marriage) చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వారి సంసార జీవితం సజావుగానే సాగింది. కానీ ఇటీవల వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. తన భార్య పార్న్ వీడియోలు(Porn videos) చూసి అందులో లాగా శృంగారం(Sex) చేయాలంటూ వేధిస్తోందని, తనను ఆ సైట్లు చూసి.. నీకు అంత శారీరక బలం లేదని.. నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా లేదా ఉంచుకుంటా.. నువ్వు ఒక హిజ్రా అంటూ తనను మానసికంగా, శారీరకం(Emotionally and physically abusive)గా వేధించేది అని భర్త ధర్మాసనం ముందు వాపోయాడు. తన తల్లి కూడా ఎందుకు పనికి రాని కొడుకును కన్నావు అంటూ తిట్టేది అని చెప్పాడు.
అలా వేధించడం మానసిక హింసే: కోర్టు
కాగా గత ఆరు ఏళ్లుగా తాము దూరంగానే ఉంటున్నామని చెప్పాడు. దీంతో కిందిస్థాయి కోర్టు(Lower Court) విడాకులు(Divorce) మంజూరు చేసింది. కాగా ఆ మహిళా మాత్రం తన భర్త చేసిన ఆరోపణలు ఖండించింది. తాను పోర్న్ సైట్లు చూసినట్లు నిరూపించేందుకు తన భర్త వద్ద ఎలాంటి అధరాలు లేవంటూ హైకోర్టు(High court)ను ఆశ్రయించింది. దీంతో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును సమర్థించింది. భర్తను హిజ్రా అని పిలవడం, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసకు గురిచేయడమే అని కోర్టు అభిప్రాయపడింది. వారు ఆరేళ్లుగా దూరంగా ఉంటున్నారని, వారిని మళ్లీ కలపలేమని తీర్పునిచ్చింది. కింది కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తున్నామని పంజాబ్, హరియాణా హైకోర్టు(High Court of Punjab and Haryana) కీలక వ్యాఖ్యలు చేసింది.