Defense Forces: సాయుధ దళాల శౌర్యం, అంకితభావం భేష్: రాష్ట్రపతి 

పహల్గామ్ దాడి(Pahalgam attack), పాకిస్థాన్‌పై భారత ప్రతిచర్యలను వివరించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్( General Anil Chauhan) సహా త్రివిధ దళాధిపతులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu)తో భేటీ అయ్యారు. భారత్ బ‌ల‌గాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సమర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, కట్టుదిట్టమైన చర్యలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు.

సాయుధ దళాల శౌర్యం, అంకితభావం భేష్

“రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది(General Upendra Dwivedi), వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్(Air Chief Marshal AP Singh), నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేశ్‌ కె. త్రిపాఠి(Admiral Dinesh K. Tripathi) రాష్ట్రపతి ముర్మును కలిసి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. ఉగ్రవాదంపై భారతదేశం ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు” అని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్(President’s House) ట్వీట్‌లో పేర్కొంది.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *