క్యాన్సర్ (Cancer Medicine ) తగ్గించే మూడు మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ లోక్ సభ వేదికగా ప్రకటించారు. క్యాన్సర్ రోగులకు ఈ తగ్గింపులతో కొంతమేరకైనా ప్రయోజనం కలుగుతుంది. ట్రాస్టూజుమాబ్ డెరక్స్టెకాన్, ఓసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మందులపై రేట్లను తగ్గించాలని ఆదేశించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ( Union Minister Anupriya Patel) శుక్రవారం లోక్ సభలో (Loksabha) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దీనితో పాటు, ఈ మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD) సున్నాకి తగ్గించారు. జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులకు ఇది కాస్త ఉపశమనం కలిగించనుంది.
తయారీదారులకు తెలిపిన కేంద్రం
ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి అన్ని పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న కుటుంబాల్లో కొంత మేర ఆర్థికంగా ఊరట లభించనుంది. క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు ఆర్థికంగా ఉపశమనం కల్పించడంతోపాటు ఈ మందుల అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వం తీసుకున్న చర్య లక్ష్యం అని మంత్రి చెప్పారు. నోటిఫికేషన్లకు అనుగుణంగా తయారీదారులు ఈ మందులపై ఎమ్మార్పీని (mrp) తగ్గించారని ఈ మార్పు గురించి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ)కి (Pharmaceutical Pricing Authority) తెలియజేశారని ఆయన స్పష్టం చేశారు.మందుల తగ్గించాలని కంపెనీలను ఆదేశిస్తూ మెమోరాండం జారీ చేసింది.
తద్వారా వినియోగదారులు ప్రయోజనం పొందవచ్చు.
దేశంలో 12 లక్షల కొత్త మరణాలు
ఈ నిర్ణయం తర్వాత, ఈ మందుల ధరలు మరింత అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నందున ఇది చాలా ముఖ్యమైందని తెలుసుకోవచ్చు. ది లాన్సెట్ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. 2019లో భారతదేశంలో దాదాపు 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.3 లక్షల మరణాలు నమోదయ్యాయని తెలుస్తుంది. కాగా ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులతో భారత్ లో (india) ఆందోళనకరంగా మారింది. ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఇది ఆందోళనకరమైన అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఫుడ్, ఎక్సర్ సైజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ మధ్యే నవజ్యోతి సింగ్ సిద్ధు (navajyot singh siddu) తన భార్య క్యాన్సర్ బారిన పడి 3 శాతమే బతికే చాన్స్ ఉండగా ఆయుర్వేద వైద్యంతో బతికిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.








