ప్రజెంట్ ఎక్కడ చూసి గిబ్లీ(Ghibli Photos) ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా(Social Media) యాప్స్ వాడే ప్రతిఒక్కరూ తమ ఫొటోలను AI యాప్ చాట్‌జీపీటీ ద్వారా గిబ్లీ ఫొటోలోకి మార్చుకొని స్టేటస్, స్టోరీలు పెట్టుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. తాజాగా మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. AIని ఉపయోగించుకుని కొందరు కొత్త తరహా ప్రయోగానికి తెరలేపారు. అయితే జనం అతితెలివి ఉపయోగించి.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే మోసపోవడం పక్కా అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..

వెలుగులోకి కొత్త తరహా వినియోగం
గిబ్లీ(Ghibli) శైలిలో ఫొటోలు తయారుచేసే AI మరో ఘనకార్యాన్ని వెలుగులోకి తెచ్చింది. AI యాప్ చాట్‌జీపీటీ(AI ChatGPT) ఇప్పుడు గిబ్లీని దాటి నకిలీ ఆధార్ కార్డులు(Fake Aadhar Cards), పాన్ కార్డుల(Pan Cards)ను తయారు చేస్తోంది. ఈ ఆధార్ కార్డులు చూడటానికి అసలైన వాటిలానే ఉండటంతో వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. కొందరు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లే, ఇప్పుడు AIతో తయారుచేసిన ఆధార్ కార్డులు, పాన్ కార్డుల చిత్రాలను షేర్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ కొన్ని ప్రాంప్ట్‌లు ఇవ్వగానే ఎవరిదైనా నకిలీ ఆధార్ కార్డును తయారు చేస్తోంది. ఇప్పుడు ఇదే అందరికీ ఆందోళనకు గురిచేస్తోంది.
ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk.
This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr
— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025
భవిష్యత్తులో ప్రమాదకరం
నకిలీ పాన్ కార్డులు చాట్‌జీపీటీ(AI ChatGPT) సహాయంతో ప్రజలు ఆధార్ కార్డులతో పాటు పాన్ కార్డులను కూడా తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌పై ప్రజలు AI ద్వారా తయారుచేసిన పాన్ కార్డు, ఆధార్ కార్డుల చిత్రాలను షేర్ చేస్తూ, AI వెంటనే పాన్, ఆధార్ కార్డులను తయారు చేస్తోందని, ఇది భవిష్యత్తు(Future)లో ప్రమాదకరం కావచ్చు అని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.








